హైదరాబాద్: 28°C
వార్తలు

డాక్టర్లపై దాడులు.. సుప్రీం కీలక ఆదేశాలు

డాక్టర్లపై రాజకీయ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులు చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. మహారాష్ట్ర వైద్యులపై దాడులపై పాల్పడే రాజకీయ నేతలను వెంటనే అదుపులోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాంటి వ్యక్తులను స్వేచ్ఛగా తిరగనివ్వొద్దని పేర్కొంది. ఆసుపత్రుల్లో వైద్య నిపుణలపై జరిగే దాడులను ఏమాత్రం తేలిగ్గా తీసుకోలేమని వెల్లడించింది.