హైదరాబాద్: 28°C
వార్తలు

కూలిన భవనం.. ఐదుగురు అధికారుల సస్పెండ్

ఢిల్లీలో హాస్టల్ భవనం కూలిన ఘటనలో సీఎం రేఖ గుప్తా సీరియస్ అయ్యారు. ఈ ప్రమాదంలో అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుంటూ MCDకి చెందిన ఐదుగురు అధికారులను సస్పెండ్ చేశారు. వీరిలో డిప్యూటీ కమిషనర్, సూపరింటెండెంట్, ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజినీర్, జూనియర్ ఇంజినీర్ ఉన్నారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 12 మందిని సురక్షితంగా రక్షించారు.