హైదరాబాద్: 28°C
వార్తలు

300KM దూరంలోని గగనతల లక్ష్యాలను కూల్చేలా!

భారత వైమానిక దళం.. సుఖోయ్ 30-MKI యుద్ధ విమానాల ఆధునికీకరణపై దృష్టిపెట్టింది. శత్రువుల గగనతల లక్ష్యాలను 300 కి.మీ. సుదూర పరిధి నుంచే ఛేదించగల రష్యాకు చెందిన RVV BD క్షిపణులను వీటికి అనుసంధానించడానికి చర్యలు తీసుకుంటోంది. త్వరలో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఆ సందర్భంగా ఈ క్షిపణుల అంశాన్ని చర్చించే అవకాశం ఉంది.