హైదరాబాద్: 28°C
వార్తలు

మాస్కో పోలీసుల అదుపులో యూపీ ఇంజినీర్‌..!

రష్యాలో తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని యూపీకి చెందిన ఇంజినీర్ చందన్ గుప్తా భార్య ఆవేదన వ్యక్తం చేసింది. గుప్తా వర్క్ వీసాపై రష్యాకు వెళ్లారని ఆమె వెల్లడించింది. ఈ క్రమంలోనే రష్యా ఆర్మీలో చేరాలని తన భర్తను ఒత్తిడి చేశారని ఆరోపించింది. తన భర్తను సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చేలా చూడాలని ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఆ మహిళ కోరింది.