ఢిల్లీలో భవనం కుప్పకూలిన ఘటనలో యజమాని పరారీలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో అతడు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఇవాళ్టి సాయంత్రంతో సహాయక చర్యలు ముగుస్తాయని ఎమ్మెల్యే అనిల్ శర్మ వెల్లడించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృతిచెందారు. మరో 11 మందిని సహాయక బృందాలు రక్షించాయి. మరికొందరు ఇంకా శిథిలాల కిందే ఉన్నట్లు సమాచారం.
వార్తలు
కూలిన భవనం.. యజమానిపై లుకౌట్ నోటీసులు


