హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంజిన్‌లో ఆయిల్ తగ్గడంతో విమానం వెనక్కి!

కొచ్చిన్ నుంచి అబుదాబికి వెళ్తున్న ఎయిరిండియా విమానం గాల్లో ఉండగా ఆయిల్ స్థాయి పడిపోవడంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. విమానం 50 నిమిషాల పాటు ప్రయాణించి, 36,000 అడుగుల ఎత్తులో వెళ్తుండగా మొదటి ఇంజిన్ ఆయిల్ స్థాయి తగ్గుతున్న విషయాన్ని పైలట్, కో-పైలట్లు గమనించారు. ఆయిల్ పరిమాణం తగ్గుతుండటంతో సిబ్బంది పరిస్థితిని అంచనా వేసి, విమానం వెనక్కి తిరిగిరావాలని నిర్ణయం తీసుకున్నారు.