తమిళనాడులో శాంతిభద్రతల నిర్వహణపై వచ్చిన విమర్శలకు సీఎం విజయ్ దీటుగా బదులిచ్చారు. పోలీస్ వ్యవస్థ కేవలం అరెస్టులు చేయడానికే కాదని, రాష్ట్ర అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. పోలీసులు చట్టాన్ని పాటించే వారికి మిత్రులుగా, చట్టాన్ని ఉల్లంఘించే వారికి శత్రువులుగా ఉంటారని అన్నారు. రాజకీయనాయకులు కానీ, అధికారులు కానీ పోలీసుల విధుల్లో జోక్యం చేసుకోకూడదని విజయ్ స్పష్టం చేశారు.
వార్తలు
పోలీసుల విధుల్లో జోక్యం చేసుకోకూడదు: విజయ్


