హైదరాబాద్: 28°C
వార్తలు

స్పీకర్‌ను ఏమీ అనలేదు: తాతా మధు

TG: సభకు, ఛైర్‌కు గౌరవం ఇచ్చే వ్యక్తినని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. తాను అనుచితంగా మాట్లాడానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. క్షమాపణ చెప్పాల్సి వస్తే సీఎం రేవంత్‌రెడ్డే చెప్పాలని అన్నారు. చరిత్రలో ఏ సీఎం మాట్లాడని మాటలు రేవంత్ మాట్లాడారని విమర్శించారు. తాను స్పీకర్‌ను ఏమీ అనలేదని, పోలీసుల తీరుపైనే మాట్లాడానని స్పష్టం చేశారు.