హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వంపై మాజీ మంత్రి తీవ్ర విమర్శలు

TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఇది ప్రజాపాలన కాదని, నిరంకుశ పాలన అని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడంపై ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులపై రక్తపు గాయాలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులను తాను ఎన్నో ఏళ్ల అసెంబ్లీ అనుభవంలో ఎప్పుడూ చూడలేదన్నారు.