హైదరాబాద్: 28°C
వార్తలు

భవనం కూలిన ఘటనపై సీఎం కీలక ఆదేశాలు

ఢిల్లీలోని సత్య నికేతన్‌లో ఐదు అంతస్తుల భవనం కూలిన ఘటనపై సీఎం రేఖా గుప్తా మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించారు. భవనం యజమానిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఘటనలో ఐదుగురు మృతి చెందగా, పలువురిని సహాయక బృందాలు రక్షించాయి. భవనం మరమ్మతులు, నిర్మాణ నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.