హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన 'ఇస్రో'

ఇస్రో భవిష్యత్ పాత్రపై కొన్ని మీడియా సంస్థలు అసత్యాలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని, ఈ కథనాలు నిరాధారమైనవని ఇస్రో పేర్కొంది. 'ఇస్రోను ప్రైవేటీకరించరు, దాని ప్రాముఖ్యాన్ని తగ్గించరు. అత్యాధునిక అంతరిక్ష పరిశోధనలు, సాంకేతిక అభివృద్ధి, వ్యూహాత్మక ప్రయోగాలు, అంతరిక్ష విజ్ఞానం, అన్వేషణ వంటి రంగాలలో ఇస్రో దేశానికి ప్రధాన సంస్థగా కొనసాగుతుంది' అని ప్రకటన విడుదల చేసింది.