హైదరాబాద్: 28°C
వార్తలు

జీఎస్టీ కౌన్సిల్ సమావేశం వాయిదా

ఢిల్లీలో ఈనెల 12, 13న జరగాల్సిన GST కౌన్సిల్ అక్టోబర్ 7కు వాయిదా పడింది. అవే తేదీల్లో బ్రిక్స్ సదస్సు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. గతేడాది SEPలో పన్ను రేట్ల (5%, 18%, 40%) సంస్కరణకు ఆమోదం తెలిపిన తర్వాత కౌన్సిల్ భేటీ కావడం తొలిసారి. TN, కేరళ, బెంగాల్‌లో ప్రభుత్వాలు మారి కొత్త సభ్యులు రానుండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.