హైదరాబాద్: 28°C
వార్తలు

'జగన్‌కు DSC, APPSCకి తేడా తెలియదు'

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు DSC, APPSCకి కనీస తేడా తెలియదని రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ ఎద్దేవా చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో విద్యావ్యవస్థ నిర్వీర్యమై.. 12 లక్షల మంది విద్యార్థులు బడికి దూరమయ్యారని మండిపడ్డారు. 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగుల పట్ల మంత్రి లోకేష్ చిత్తశుద్ధిని చాటుకున్నారని స్పష్టం చేశారు.