హైదరాబాద్: 28°C
వార్తలు

గోకవరంలో జలమయమైన లోతట్టు ప్రాంతాలు

E.G: గోకవరం మండలంలో ఆదివారం సాయంత్రం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాంప్లెక్స్‌ సమీపంలో వర్షపు నీరు రోడ్డుపై భారీగా చేరడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం కావడంతో వాహనాల రద్దీ కూడా పెరిగింది. అయితే ఈ వర్షం వరి పొలాలకు ఎంతో ఉపయోగపడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.