హైదరాబాద్: 28°C
వార్తలు

ముగ్గురు మృతి.. ఐదుగురి పరిస్థితి విషమం

ఢిల్లీ సత్యనికేతన్ సమీపంలో హాస్టల్ భవనం కూలిన ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరో 9 మందిని రక్షించినట్లు వెల్లడించారు. వీరిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.