హైదరాబాద్: 28°C
వార్తలు

8 హైకోర్టుల‌కు చీఫ్ జ‌స్టిస్‌ల‌ను నియ‌మించిన కేంద్రం

సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుల మేరకు 8 హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్రం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ కామేశ్వరరావును పట్నా హైకోర్టుకు, బాంబే హైకోర్టుకు చెందిన జస్టిస్ రవీంద్రను కలకత్తా హైకోర్టుకు, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌ను రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ చేశారు.