హైదరాబాద్: 28°C
వార్తలు

వైద్యులపై శివసేన నేతల దాడి

మహారాష్ట్ర పాల్ఘర్‌లో వైద్యులు, ఆసుపత్రి సిబ్బందిపై శివసేన కార్యకర్తలు దాడి చేయడం చర్చనీయాంశమైంది. అలాగే ఈ ఘటనలో జోక్యం చేసుకునేందుకు యత్నించిన రిసెప్షనిస్టును ఓ నేత చెంపదెబ్బ కొట్టినట్లు పలువురు ఆరోపించారు. కృష్ణ భక్తుల డిశ్చార్జ్ టైంలో బిల్లు చెల్లించాలని ఆసుపత్రి సిబ్బంది కోరడంతో ఈ వివాదం తలెత్తింది. దీంతో ఒక్కసారిగా ICUలోకి వచ్చిన కార్యకర్తలు సిబ్బందిపై దాడి చేశారు.