హైదరాబాద్: 28°C
వార్తలు

ధర్మవరం అధ్యాపకురాలికి రాష్ట్రస్థాయి అవార్డు

SS: ధర్మవరం ప్రభుత్వ మోడల్ ఇంటర్మీడియట్ కళాశాల ఫిజిక్స్ అధ్యాపకురాలు పీవీ శ్రావణికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. విజయవాడలో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా పురస్కార పత్రం, బంగారు పతకం, రూ.20 వేల చెక్కు అందుకున్నారు. ఈ గౌరవం తన బాధ్యతను మరింత పెంచిందని, విద్యార్థులకు మెరుగైన బోధన అందిస్తానని శ్రావణి తెలిపారు.