హైదరాబాద్: 28°C
వార్తలు

'ఇచ్చిన హామీలను అమలు చేయాలి'

PDPL: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి శంకర్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఎన్టీపీసీలో జరిగిన జిల్లా సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమకారులకు రూ.25 వేల పింఛన్, 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని కోరారు. హామీలు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.