హైదరాబాద్: 28°C
వార్తలు

సిక్కింలో విరిగిపడిన కొండచరియలు

సిక్కింలోని మంగన్ జిల్లాలో తెల్లవారుజామున భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. నాగా అటవీ ప్రాంతంలోని తీస్తా, చ్యాకూంగ్ నదుల సంగమం వద్ద కొండ నుంచి భారీగా మట్టిదిబ్బలు పడటంతో నదుల ప్రవాహానికి పాక్షికంగా అంతరాయం ఏర్పడింది. అయితే, 2 నదుల్లో నీటి ప్రవాహం ఇప్పటివరకు సహజంగానే ఉందని అధికారులు తెలిపారు. నీటి ప్రవాహాన్ని నిరంతరం పరిశీలించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.