ఢిల్లీ సత్యనికేతన్ సమీపంలో హాస్టల్ భవనం కూలిన ప్రదేశాన్ని సీఎం రేఖా గుప్తా పరిశీలించారు. ఇప్పటివరకు ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మరోవైపు ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాయి.
వార్తలు
భవనం కూలిన ప్రదేశాన్ని సందర్శించిన సీఎం


