W.G: తణుకు మండలం వేల్పూరు శివారులో పేకాట స్థావరంపై తణుకు రూరల్ పోలీసులు ఆదివారం దాడి చేశారు. గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారంతో రూరల్ ఎస్సై శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద రూ.2400 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట శిబిరం పై దాడి


