హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్లపాలెంలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్

BPT: ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాలతో కర్లపాలెం పరిధిలోని ఎట్రావారిపాలెంలో ఆదివారం పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. బాపట్ల ఇన్‌చార్జ్ డిఎస్పీ పి.జగదీష్ నాయక్ నేతృత్వంలో 50 మంది సిబ్బంది తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 38 వాహనాలను సీజ్ చేశారు. గంజాయి స్మగ్లింగ్ చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.