హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి మెట్టు మార్గంలో ప్రమాదం

TPT: శ్రీనివాసమంగాపురం నుంచి శ్రీవారి మెట్టు వైపు వెళ్లే మార్గంలో ఆదివారం కారు ప్రమాదం జరిగింది. శ్రీవారి మెట్టుకు కిలోమీటర్ దూరంలో అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో రమాదేవి(56), పద్మ(56), యాదగిరి(58), డ్రైవర్ ప్రేమకుమార్(37) గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.