హైదరాబాద్: 28°C
వార్తలు

సాంకేతిక సమస్య.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

విమానం అత్యవసర ల్యాండింగ్ అయిన ఘటన బెంగళూరు విమానశ్రయంలో చోటుచేసుకుంది. వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం లండన్‌కు బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్లు గుర్తించారు. విమానాన్ని అరగంటకు పైగా గాలిలో చక్కర్లుకొట్టించి.. అనంతరం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 270 మంది ప్రయాణికులు ఉన్నారు.