హైదరాబాద్: 28°C
వార్తలు

'సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ ఉద్యమిస్తాం'

AP: జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఉద్యమ కార్యాచరణ తాత్కాలికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీఎంతో చర్చల వివరాలను తమ కార్యవర్గానికి తెలిపినట్లు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి ఇంకా కొన్ని విషయాలపై స్పష్టత రాలేదన్నారు. ఐఆర్, బకాయిలపై స్పష్టత ఇవ్వలేదన్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ ఉద్యమిస్తామని చెప్పారు.