TG: ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో మంత్రి తుమ్మల పర్యటించారు. ఈ సందర్భంగా కొత్త పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి స్థలపరిశీలన చేశారు. పామాయిల్ టన్ను ధర రూ.25 వేలకు చేరిందని తెలిపారు. ఎల్‌నినోతో వచ్చే నెలలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుందని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు తెచ్చి చెరువుల్లో నింపేందుకు కృషి చేస్తామని తుమ్మల వెల్లడించారు.
వార్తలు
వచ్చే నెలలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుంది: తుమ్మల


