హైదరాబాద్: 28°C
వార్తలు

విషాదం.. మద్యం సేవించి 9 మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బండా తహసీల్‌లో కల్తీ మద్యం సేవించి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులంతా బరాజ్ గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలిని ఎస్పీ అనురాగ్ సుజానియా పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.