హైదరాబాద్: 28°C
వార్తలు

కేవలం రూ.67 కోసం 32 ఏళ్ల కేసు

కేవలం రూ.67 కోసం ఓ బస్సు కండక్టర్‌పై 32 ఏళ్ల పాటు సుదీర్ఘ న్యాయపోరాటం చేసిన ఢిల్లీ రవాణా సంస్థకు హైకోర్టు మొట్టికాయలు వేసింది. కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు డీటీసీకి రూ.లక్ష జరిమానా విధించింది. 1994లో ముగ్గురు ప్రయాణికుల నుంచి రూ.67 తీసుకుని టికెట్లు ఇవ్వలేదనే నెపంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు డీటీసీ తీరును తీవ్రంగా తప్పుబట్టింది.