హైదరాబాద్: 28°C
వార్తలు

యువకుడిపై మరిగే నూనె పోసిన మహిళ

కుమార్తెను ప్రేమించిన యువకుడిపై ఓ మహిళ మరిగే నూనె పోసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఉత్తిరంపట్టు గ్రామానికి చెందిన దమీమ్ కుమార్తెను లోకేష్ అనే యువకుడు రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. కుమార్తెనిచ్చి పెళ్లి చేయమని దమీమ్‌ను కోరడంతో ఆమె ఆగ్రహానికి గురై వంటగదిలోని మరిగే నూనెను అతడిపై పోసింది. గాయపడిన లోకేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.