హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గోరికొత్తపల్లిలో పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలి'

BHPL: గోరికొత్తపల్లి (M) కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం చిన్నపాటి అనారోగ్యానికి కూడా పరకాల, ములుగు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. నూతన మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రితో పాటు అంబులెన్స్‌ సౌకర్యం కల్పిస్తే మండలంలోని 16 గ్రామ పంచాయతీల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.