హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనారోగ్యంతో ఉన్న నాయకులను పరామర్శించిన జీవన్ రెడ్డి

JGL: జగిత్యాల పట్టణంలో అనారోగ్యంతో బాధపడుతున్న నాయకులను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. రవీందర్ రెడ్డి, హేమేందర్ రెడ్డితో పాటు పలువురిని ఆయన స్వయంగా కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చికిత్స వివరాలను తెలుసుకుని, ధైర్యంగా ఉండాలని సూచించారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.