హైదరాబాద్: 28°C
తెలంగాణ

భవిత కేంద్రంలో ఈనెల 8న ALIMCO శిబిరం

MLG: ములుగు భవిత కేంద్రంలో ఈ నెల 8న ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సహాయక ఉపకరణాల కోసం ALIMCO గుర్తింపు, అంచనా శిబిరం నిర్వహించనున్నట్లు డీఈవో ఏ.సిద్ధార్థరెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే శిబిరానికి విద్యార్థులు రెండు ఫొటోలు, వైకల్య ధ్రువీకరణ పత్రం/UDID, ఆదాయ ధ్రువీకరణ పత్రం లేదా రేషన్‌కార్డు, ఆధార్‌కార్డుతో హాజరుకావాలని సూచించారు.