MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని అమెరికాకు చెందిన జాన్ చెర్మక్ ఆదివారం సందర్శించారు. అర్చకులు హరిశ్ శర్మ, ఉమాశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేష్ ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యతను వివరించారు. ఈవో ఇమ్మడి భాస్కర్‌తో పాటు పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
రామప్పను సందర్శించిన అమెరికా దేశస్థుడు


