MLG: చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బయ్యక్కపేటలో చోటు చేసుకుంది. SI కమలాకర్ వివరాల ప్రకారం.. స్థానికుడైన ఓదెలు (36) ఈ నెల 2న ఓ మహిళ స్నానం చేస్తుండగా చూశాడని ఆరోపిస్తూ ఆ మహిళ కుటుంబ సభ్యులు ఓదెలపై దాడి చేశారు. దీంతో మనస్థాపానికి గురైన ఓదెలు పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించారు.
తెలంగాణ
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి


