NRPT: వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా సక్రమంగా అందడం లేదని ఆరోపిస్తూ ఆదివారం మక్తల్ మండలంలోని అనుగొండ, అంకేన్పల్లి, గడ్డంపల్లి గ్రామాల రైతులు సబ్‌స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. వ్యవసాయానికి కనీసం 10 గంటలు కూడా సరిగ్గా కరెంట్ ఇవ్వడం లేదని వాపోయారు. అధికారులు స్పందించి నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని కోరారు.
తెలంగాణ
సబ్‌స్టేషన్ వద్ద రైతుల నిరసన


