MHBD: తొర్రూరు మండలం సోమారం గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధిత కుటుంబానికి 'మా ఫౌండేషన్' ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా మా ఫౌండేషన్ ఫౌండర్ పస్తం కృష్ణ మాట్లాడుతూ... ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు తమ వంతు సహాయం అందించడం మా బాధ్యత అని, బాధితులకు సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.
తెలంగాణ
'బాధిత కుటుంబానికి అండగా మా ఫౌండేషన్'


