హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇంట్లోకి చొరబడిన కొండచిలువ.. భయంతో చంపిన స్థానికులు

HNK: ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఆదివారం భారీ కొండచిలువ కలకలం రేపింది. ఓ ఇంట్లోకి అకస్మాత్తుగా కొండచిలువ చొరబడటంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. కొండచిలువను గమనించిన స్థానికులు దానిని బయటకు పంపేందుకు ప్రయత్నించారు. అయితే అది ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవడంతో భయంతో కర్రలతో కొట్టి చంపారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.