హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాలువకు నీటి విడుదల చేసిన అధికారులు

KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు పాలేరు రిజర్వాయర్ నుంచి చిన్న కాలువకు ఈరోజు అధికారులు నీటిని విడుదల చేశారు. శనివారం సాయంత్రం 6:30 గంటల సమయంలో గేట్లు పైకి లేపి నీటిని కిందకు వదిలారు. సాగునీటి అవసరాల దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాలువ కింద ఉన్న ఆయకట్టు రైతులకు సాగునీరు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.