హైదరాబాద్: 28°C
తెలంగాణ

కించపరిచేలా పోస్టులు, వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు

ASF: సోషల్ మీడియా వేదికగా వ్యక్తులు, ప్రజాప్రతినిధులు, నాయకులను కించపరిచేలా పోస్టులు, వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని పెంచికల్ పేట SI అనిల్ కుమార్ హెచ్చరించారు. అసత్య, అభ్యంతరకర పోస్టులు చేయడం, వాటిని షేర్ చేయడం కూడా చట్టపరమైన సమస్యలకు దారితీస్తుందని తెలిపారు. గ్రూపు అడ్మిన్లు అభ్యంతరకర పోస్టులు ప్రచారం కాకుండా పర్యవేక్షించాలని సూచించారు.