హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీట్‌లో 441వ ర్యాంక్ సాధించిన గాయత్రి

JGL: రాయికల్ పట్టణం వడ్డేర కాలనీకి చెందిన పెనుగొండ గాయత్రి నీట్ ఫలితాల్లో 441వ ర్యాంక్ సాధించి మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఉచిత ఎంబీబీఎస్ సీటు పొందింది. చిన్నతనం నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన గాయత్రి కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఆమెను పలువురు అభినందిస్తూ వైద్య రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.