హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతుల భూసేకరణపై కలెక్టర్ సమీక్ష

MBNR: బ్రహ్మోస్ క్షిపణి తయారీ పరిశ్రమ ఏర్పాటుకు చౌదర్‌పల్లి రైతుల భూసేకరణపై జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ చర్చల్లో రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం, భూమి మార్కెట్ విలువ, భూసేకరణకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియలపై ప్రధానంగా చర్చించారు. రైతులకు న్యాయం జరిగేలా చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.