హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

BHNG: మర్రిగూడ(M)లో శనివారం జరిగిన విద్యుత్ ప్రమాదంలో చెన్నమ్మ(56) అనే మహిళ మృతి చెందారు. బోనాల పండుగ నేపథ్యంలో ఇల్లు శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగ తగిలి ఆమె అక్కడికక్కడే పడిపోయారు. భార్యని కాపాడపోయి భర్త కూడా షాక్‌కు గురయ్యారు. ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు  నిర్ధారించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.