ములుగు జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 7న సోమవారం డెమో, ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు డీఈవో సిద్ధార్థరెడ్డి తెలిపారు. బోధన పోస్టులకు డెమో, బోధనేతర పోస్టులకు ముఖాముఖి ఉంటుందన్నారు. బండారుపల్లి పీఎంశ్రీ మోడల్ స్కూల్‌లో ఉదయం 10 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.
తెలంగాణ
గురుకుల పోస్టులకు 7న ఇంటర్వ్యూలు


