హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు పలు ప్రాంతాల్లో కరెంట్‌ కట్!

NRML: నిర్మల్ పట్టణం-1 ఉపకేంద్రం పరిధిలో మరమ్మతు పనుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ కె. శ్రీనివాసరావు తెలిపారు. మయూరి హోటల్ నుంచి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, నాయుడువాడలో 10 నుంచి 12.30 వరకు, జుమ్మెరాత్‌పేట్‌లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు.