ADB: భీంపూర్ (M) పిప్పల్కోటికి చెందిన రైతు బూర్గుల అశోక్(56) అప్పులబాధతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం వెలుగుచూసింది. కొత్తగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంట్లోనే ఈ ఘటనకు పాల్పడ్డారు. కుమారుడి వైద్యం కోసం గతేడాది రెండెకరాల భూమిని విక్రయించినా అప్పులు మిగలడంతో మనోవేదనకు గురైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
తెలంగాణ
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య


