హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని ఆదివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలియజేశారు. విద్యుత్ లైన్ల ఏర్పాటు కారణంగా పట్టణంలోని కోలిపుర, అశోక్ రోడ్, కుమ్మరివాడ, బొక్కలగూడ పరిసర ప్రాంతాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ నిలిపివేయడం జరుగుతుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.