హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాళోజీ వర్సిటీలో ఎంబీబీఎస్ విద్యార్థుల అవస్థలు

WGL: కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ పాసైన విద్యార్థులకు సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జాప్యం నెలకొంది. శనివారం స్లాట్ బుక్ చేసుకుని పూణే, బెంగళూరు, ముంబై నుంచి సుమారు 200 మంది విద్యార్థులు ఉదయం 9 గంటలకే వచ్చారు. సంతకం కాలేదంటూ 12 గంటలుగా తిప్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించాలని కోరారు.