హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆసుపత్రికి పూర్తి వైద్య సేవలు కల్పించాలి'

NLG: నార్కట్ పల్లి మండలంలో శనివారం మాజీ ఎమ్మెల్యే లింగయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నకిరేకల్ 100 పడకల ఆసుపత్రిని బీఆర్ఎస్ హయాంలోనే మంజూరు చేసి 80 శాతం పనులు పూర్తి చేశామని తెలిపారు. ఆసుపత్రిని ప్రారంభిస్తున్నందుకు స్వాగతం పలికారు. పూర్తిస్థాయి వైద్య సేవలు, వైద్యులు, సిబ్బంది, పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.