హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాళం వేసిన ఇంట్లో దొంగల చోరీ

KNR: వీణవంక (M) భేతిగల్‌లో ఓ ఇంట్లో దుండగులు చొరబడి బంగారు, వెండి ఆభరణాలు అపహరించారు. ఏఎస్సై వెంకట్‌రెడ్డి వివరాల ప్రకారం.. కొక్కిరాల సంపతారావు ఈ నెల 3న ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన స్థానికులు ఆయనకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో అర తులం బంగారం, రెండు వెండి పళ్లాలు చోరీ అయినట్లు బాధితుడు తెలిపారు.